Site icon NTV Telugu

T20 World Cup: టీ20 వరల్డ్ కప్కు టీమిండియా ప్రకటన అప్పుడే..!

T20 World Cup

T20 World Cup

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ఐసీసీ (ICC) గడువు ఇచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా.. ఐపీఎల్ స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Read Also: LSG vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్..

ఈ మెగా టోర్నీ వెస్టింసీడ్, అమెరికాలో జరుగనున్న సంగతి తెలిసిందే. జూన్ 1న వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా, కెనడా మధ్య పోరు ఉండనుంది. జూన్ 29న బార్బడోస్ లో ఫైనల్‌ మ్యాచ్ ఉండనుంది. కాగా.. ఈ మెగాటోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా స్క్వాడ్ ఎప్పుడు ప్రకటిస్తారనేది క్లారిటీ వచ్చింది. ఈ సందర్భంగా.. బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టు ఎంపిక చేయబడుతుంది. ఆ సమయంలో సగం ఐపీఎల్ మ్యాచ్ లు ముగుస్తాయి”. అని తెలిపారు. మే 19న ఐపీఎల్ లీగ్ దశ ముగియగానే మొదటి బ్యాచ్.. ఐపీఎల్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన జట్ల ఆటగాళ్లు తర్వాత సెకండ్ బ్యాచ్ న్యూయార్క్‌కు వెళతారని తెలిపారు.

Read Also: Skin Care: వేసవిలో మీ చర్మం యవ్వనంగా ఉండాలంటే.. వీటిని తీసుకోండి..!

ఇక.. మ్యాచ్ల విషయానికొస్తే, గ్రూప్ ‘ఏ’ లో పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా, భారత్ లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా గ్రూప్‌ ‘బి’ లో ఉన్నాయి. ఆతిథ్య వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా గ్రూప్ ‘సి’ లో తలపడతాయి. గ్రూప్ ‘డి’ లో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లతో గ్రూప్ ఆఫ్ డెత్ గా పరిగణిస్తున్నారు.

Exit mobile version