Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో వెస్టిండీస్ భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మైదానంలో భావోద్వేగ క్షణం చోటు చేసుకుంది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు సంజూ చేసిన కృషిని భారత్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత సంజూ శామ్సన్ ఆవేశంతో హెల్మెట్‌ను గాల్లోకి విసిరేయడం, చేతులను ఆకాశం వైపు ఎత్తి దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం అభిమానులను కదిలించింది. ఎన్నో రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న సంజూ సమాధానమిచ్చాడు. అయితే.. సెలబ్రేషన్‌లో భాగంగా సంజూ బ్యాట్‌ను విసిరేయడం వివాదంగా మారింది. ఈ అంశంపై ఐసీసీ (ICC) ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మైదానంలో హెల్మెట్ లేదా బ్యాట్ విసరడం అనుచిత ప్రవర్తన కిందకు రావచ్చు. ఆటగాళ్ల ప్రవర్తన విషయంలో ఐసీసీ చాలా కఠినంగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మ్యాచ్ ఫీజులో జరిమానా, డిమెరిట్ పాయింట్లు లేదా సస్పెన్షన్ కూడా విధించే అవకాశం ఉంటుంది.
READ MORE: Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!
Also Read
ఈ నియమాల వెనుక ముఖ్య ఉద్దేశం కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు, అంపైర్లు, సిబ్బంది భద్రతను కాపాడటం. హెల్మెట్ లాంటి పరికరాన్ని విసరడం వల్ల అనుకోకుండా ఎవరికైనా గాయం కావచ్చు. అందుకే క్రికెట్‌లో భావోద్వేగాలకన్నా నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సంజూ సెలబ్రేషన్ చూసిన చాలామందికి ఒక పాత సంఘటన గుర్తొచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో అవేష్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచిన తర్వాత హెల్మెట్‌ను నేలపై విసిరాడు. ఆ ఘటనతో అవేష్ ఖాన్‌కు అధికారిక హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు సంజూ విషయంలోనూ అలాంటి చర్యలే ఉంటాయా? అన్నది చూడాలి.
READ MORE: Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!
తాజావార్తలు
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్‌లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై.. హైకోర్టు సీరియస్..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!