T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో ఏకంగా తొలిసారి 12 జట్లు పాల్గొననున్నాయి. గత టోర్నమెంట్‌లో 10 జట్లు మాత్రమే పాల్గొనగా.. ఈసారి రెండు జట్లను పెంచింది ఐసీసీ. కొత్త జట్లకు మరిన్ని అవకాశాలు కల్పించే మార్గంగా ఐసీసీ ఈ నిరన్యం తీసుకుంది. ఇకపోతే, 2024 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టాప్-5గా నిలిచిన జట్లు, ఈసారి హోస్ట్‌గా ఉన్న ఇంగ్లాండ్, అలాగే మిగిలిన జట్లలో టాప్-3 ర్యాంకులో ఉన్న జట్లు ఇప్పటికే వుమెన్స్ వరల్డ్ కప్ 2026కి అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీ 2026 జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్‌లో జరగనుంది.
ENG vs IND: టీ20 తరహా బ్యాటింగ్.. లంచ్ బ్రేక్‌కి ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?
అయితే, మిగిలిన నాలుగు జట్ల ఎంపిక కోసం, గ్లోబల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను నేపాల్ హోస్ట్ చేయనుంది. ఇది నేపాల్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద ఈవెంట్ అవుతుంది. ఈ టోర్నీ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 2, 2026 వరకు ఖాట్మండు ముల్పానీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఇక ఇప్పటికే గ్లోబల్ క్వాలిఫయర్‌కు అర్హత పొందిన జట్లను చూస్తే.. ఆసియా రీజియనల్ టాప్-2 జట్లలో నేపాల్, థాయిలాండ్ లు అర్హత సాధించగా, అమెరికాస్ రీజియనల్ క్వాలిఫయర్ విజేతగా యుఎస్ఏ నిలిచి అర్హత సాధించింది. అలాగే 2024 వరల్డ్ కప్‌లో టాప్-8కు చేరని జట్లు బంగ్లాదేశ్, స్కాట్లాండ్ లు అర్హత సాధించాయి. ఇక వీటితోపాటు ఆఫ్రికా నుండి 2 జట్లు, యూరప్ నుండి 2 జట్లు, ఈస్ట్ ఏషియా పసిఫిక్ రీజియన్ నుండి 1 జట్టు కూడా గ్లోబల్ క్వాలిఫయర్‌కు ఎంపిక కానున్నాయి.
BSNL Azadi Ka Plan: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! కేవలం రూ.1కే 30 రోజులు అన్లిమిటెడ్ డేటా, కాల్స్!
ఈ 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో టాప్-3 జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు వెళ్లతాయి. అటుపై, సూపర్ సిక్స్‌లో టాప్-4 జట్లు 2026 వరల్డ్ కప్‌లో తమ స్థానం దక్కించుకుంటాయి. టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అన్ని జట్లు ఖరారు అయిన తర్వాత ఐసీసీ విడుదల చేయనుంది.
