India vs Pakistan: రేపే హీట్ పుట్టించే భారత్ – పాకిస్థాన్ మ్యాచ్. శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగనుంది. ఈసారి రెండు జట్లు రెండు రకాల భారం మోస్తూ మైదానంలోకి దిగుతున్నాయి. భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యా్చ్‌కు ముందు ఇప్పుడు ఇట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.. ముందుగా ఈ మ్యాచ్‌లో తలపడుతున్న ఇద్దరు నాయకుల గురించి అంచనా వేద్దాం. ఈ ఇద్దరు కెప్టెన్లది ఒకే ఆర్మ్‌బ్యాండ్. కానీ రెండు వేర్వేరు పరిస్థితులు. ప్రస్తుతం ఆ బాధ్యతను ఎవరు బాగా నిర్వర్తిస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో కెప్టెన్ల ఒత్తిడి మామూలుగా ఉండదు. కెప్టెన్సీ అంటే కేవలం ఫీల్డ్ సెట్టింగ్ కాదు. జట్టు మనసును నిలబెట్టాలి. తొందర పాటు నిర్ణయాలు, ఆందోళనతో బౌలింగ్ మార్పులు, బ్యాటింగ్ వీటన్నింటినీ జయించాలి. అయితే.. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు భారత్‌ను 44 మ్యాచ్‌ల్లో నడిపించాడు. అందులో 35 విజయాలు. ఓటములు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. దాదాపు 80 శాతం విజయం సాధించాడు. సూర్యకుమార్ జట్టు ఎలాగైనా గెలవాలని ముందుగానే భావించి మైదానంలోకి దిగుతాడు.
READ MORE: Rahul Gandhi: రైతులతో రాహుల్‌గాంధీ భేటీ.. ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ బీజేపీ ధ్వజం
సల్మాన్ అలీ ఆఘా పాకిస్థాన్‌కు 45 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. 29 విజయాలు, 16 ఓటములు. 64 శాతం విజయం. రికార్డు అంత చెత్తదేం కాదు.. కానీ సూర్యకుమార్ స్థాయికి ఆఘా ఇంకా చేరలేదు. బ్యాటింగ్ విషయానికి వస్తే.. సూర్యకుమార్ 106 టీ20 మ్యాచ్‌లు ఆడి, సగటు 37కి పైగా, స్ట్రైక్‌రేట్ 165తో రన్స్ చేశాడు. సూర్య టార్గెట్ కేవలం పరుగులు మాత్రమే చేయడం కాదు.. కష్టకాలంలో మ్యాచ్ గమనాన్ని మార్చేస్తాడు. ఓడిపోతున్న టీమ్‌ను ఒంటి చేత్తో గెలిపిస్తాడు. మరోవైపు.. ఆఘా 47 మ్యాచ్‌ల్లో సగటు 22 చుట్టూ, స్ట్రైక్‌రేట్ 122. ఈ సంఖ్యలు చూస్తే టీ20లో ఎవరు ముందున్నారు అనే విషయాన్ని పెద్దగా చెప్పనవసరం లేదు.. ఆఘా బ్యాటింగ్ శైలి కొంత భిన్నంగా ఉంటుంది. ఇలాంటి బ్యాటింగ్ వల్ల కొన్నిసార్లు జట్టుకు నష్టం జరగవచ్చు. ఓటమి దిశలో ఉన్న టీమ్ దిశను కొన్ని ఓవర్లలోనే తిప్పేస్తాడు సూర్యకుమార్.. కానీ ఆఘాకు అంత సీన్‌లేదు. చాలా లేట్‌గా పరుగులు స్కోర్ చేస్తుంటాడు. ఒత్తిడి సమయంలోనే అసలు నాయకత్వం బయటపడుతుంది. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియాకు తొలి మ్యాచ్ అయిన భారత్- యూఎస్‌ఏ పోరు గురించి తెలిసిందే. భారత్ 77/6 వద్ద కష్టాల్లో పడింది. అప్పుడు సూర్యకుమార్ 49 బంతుల్లో 84 నాటౌట్ ఆడాడు. సూర్య ఇన్నింగ్స్ మ్యాచ్‌ను గెలిపించింది. కెప్టెన్ తొందరపడలేదు. మొదట జట్టును నిలబెట్టాడు. చివర్లో వేగం పెంచాడు. దాని తర్వాత నమీబియాపై భారత్ 209/6 చేసి 93 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అంటే అవసరమైతే కష్టాలనుంచి బయటపడగలదు. అవకాశం దొరికితే పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుంది. సంఖ్యలు, ఫామ్, ప్రస్తుత ప్రదర్శన ఇవన్నీ చూస్తే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ ముందున్నాడు.
