T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం (మార్చి 8)న అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానుల కోసం నార్తర్న్ రైల్వే (NR) ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఆలస్యంగా విడుదల కావడంతో చాలామంది క్రికెట్ అభిమానులు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. మరోవైపు విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంతో అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో నార్తర్న్ రైల్వే ఢిల్లీ నుంచి సబర్మతి వరకు ప్రత్యేక రైలును నడిపేందుకు సిద్ధమైంది.
India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్‌కు ముందు సంచలన నిర్ణయం!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఈ ప్రత్యేక రైలు నేడు (మార్చి 7)రాత్రి 11:45 గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు మార్చి 8 మధ్యాహ్నం 2:30 గంటలకు సబర్మతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, గురుగ్రమ్, జైపూర్ మార్గంగా ప్రయాణిస్తుంది. 04062 ట్రైన్ నంబర్ కలిగిన ఈ రైలులో మొత్తం 19 కోచ్‌లు ఉండగా.. వాటిలో థర్డ్ AC, సెకండ్ AC కోచ్‌లు కూడా ఉంటాయి.
భారత జట్టు శుక్రవారం నాడే అహ్మదాబాద్ కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించనుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రాక్టీస్ చేయనుంది. న్యూజిలాండ్ జట్టు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది. భారత్ మీడియా సమావేశం మాత్రం ప్రాక్టీస్‌కు 15 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది.
Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!
ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌ను ఒక్కసారి కూడా ఓడించలేదు. దీనితోపాటు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఈసారి చరిత్రను తిరగరాస్తోందని నమ్మకం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా భారత్ వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా నిలవడం, సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా నిలవడం లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!