T20 World Cup 2024 set to be played from June 4: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలలో భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముహూర్తం ఖారారు చేసినట్లు తెలుస్తోంది. 2024 జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనున్నట్లు ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో తమ నివేదికలో పేర్కొంది. దీనిపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
టీ20 ప్రపంచకప్ 2024 మొత్తం 10 వేదికల్లో జరగనున్నాయని సమాచారం. ఇందులో 5 వేదికలు అమెరికాలో.. మిగతా ఐదు వేదికలు వెస్టిండీస్‌లో ఉంటాయి. అయితే అమెరికాలో 5 వేదికలను ఐసీసీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లోరిడా, మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్ ఆ జాబితాలో ఉన్నాయి. మోరిస్‌విల్లే, డల్లాస్‌లలో ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నారు. మోరిస్‌విల్లే, డల్లాస్ సహా న్యూయార్క్ మైదానాలు ఇంకా అంతర్జాతీయ వేదిక హోదాను పొందలేదు. వేదికలపై తుది నిర్ణయం ఐసీసీ త్వరలోనే తీసుకుంటుందని సమాచారం.
Also Read: Sanjay Dutt First Look: బిగ్ బుల్‌గా సంజయ్ దత్.. లుక్ పోలా అదిరిపోలా! కేజీఎఫ్ 2 రేంజ్
టీ20 ప్రపంచకప్ 2023 టోర్నీలో 16 జట్లకు బదులుగా 20 జట్లు పోటీపడనున్నాయి. 20 జట్లను 5 జట్లు చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు.. సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8 రౌండ్‌లో 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూపు నుంచి తొలి రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్ ఆడతాయి. అందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ ఆడుతాయి.
ఈ టీ20 ప్రపంచకప్‌కు 12 జట్లు నేరుగా అర్హత సాధించాయి. అమెరికా, వెస్టిండీస్ అతిథ్య హోదాలో బెర్త్‌లను ఖారారు చేసుకున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో టాప్ 8లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 9, 10 స్ధానాల్లో ఉన్న ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. మిగిలిన 8 స్ధానాలకు ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగుతున్నాయి. గత కొన్ని ఎడిషన్లగా టీ20 ప్రపంచకప్ ఆక్టోబర్-నవంబర్‌లో జరుగుతూ వస్తున్నా.. ఈ సారి జూన్‌లో జరగనుండడం గమనార్హం.