Site icon NTV Telugu

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్..

Icc 2024 Wc

Icc 2024 Wc

2024 టీ20 ప్రపంచకప్ కోసం 26 మంది మ్యాచ్ అధికారులను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. జూన్ 2 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న ఈ మెగా టోర్నీకి 20 మంది అంపైర్లు, ఆరుగురు రిఫరీలను ఐసీసీ నియమించింది. వీరిలో ముగ్గురు భారత అధికారులు చోటు దక్కించుకున్నారు.

వచ్చే నెలలో తొమ్మిదో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దాంతో ఇప్పుడు మ్యాచ్ అధికారుల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. టోర్నమెంట్ కోసం 26 మంది అధికారులు నియమించబడ్డారు, ఇందులో 20 జట్లు 28 రోజుల పాటు 55 మ్యాచ్ లు జరగనున్నాయి. వీరిలో 20 మంది రిఫరీలు కాగా, ఆరుగురు రిఫరీలు. వీరిలో ముగ్గురు భారత్‌కు చెందిన వారు. నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్ అంపైర్లుగా ఎంపికయ్యారు. జవగల్ శ్రీనాథ్ ఒక్కరు ప్రపంచకప్‌ కు రిఫరీగా వెళ్లనున్నాడు. ఈ మెగా టోర్నీకి ఎంతో మంది అనుభవజ్ఞులైన న్యాయ నిర్ణేతలు ఎంపికయ్యారు. వీరిలో రిచర్డ్ ఇల్లింగ్‌ వర్త్, కుమార ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రైఫిల్ ఉన్నారు.

భారత్‌కు చెందిన జయరామన్ మదనగోపాల్ ఈ ప్రపంచకప్‌లో తొలిసారిగా సీనియర్ క్రికెట్ మ్యాచ్‌ లకు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఇక మ్యాచ్ రిఫరీల విషయానికొస్తే.., జియోఫ్ క్రోవ్, ఆండ్రూ పైక్రాఫ్ట్, రంజన్ మదుగలె లతోపాటు శ్రీనాథ్ ఉన్నారు. ఇక ఎంపికైన అంపైర్ల విషయానికి వస్తే.. క్రిస్ బ్రౌన్, ధర్మసేన, క్రిస్ గఫనీ, మైఖేల్ గాఫ్, హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుద్దీన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మేనన్, సామ్ నోగాస్కి, ఎహసాన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రైఫిల్, లాంగ్టన్ రుసెరె, షాహిత్ సైకాత్, రాడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్ లు ఎన్నికయ్యారు. అలాగే మ్యాచ్ రిఫరీలలో డేవిడ్ బూన్, జెఫ్ క్రో, రంజన్ మదుగలె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగళ్ శ్రీనాథ్ లు ఉన్నారు.

Exit mobile version