NTV Telugu Site icon

T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ లో కీలక బాధ్యతలు చేపట్టనున్న సిక్సర్ల కింగ్‌.. ఆఫీసియల్..

T20 World Cup

T20 World Cup

అతి త్వరలో మొదలుకానున్న టి20 వరల్డ్ కప్ 2024 గాను టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల కింగ్‌ యువరాజ్ సింగ్ కీలక బాధ్యతలను పోషించబోతున్నాడు. తాజాగా ఐసీసీ యువరాజ్ సింగ్ ను టీ20 వరల్డ్ కప్ కు అంబాసిడర్ గా నియమించింది. ఇందులో భాగంగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఒలంపిక్స్ లో 8 సార్లు బంగారు పథకాలను గెలిచిన ఉసేన్‌ బోల్ట్‌ తో కలిసి యువరాజ్ సింగ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్లు ఐసీసీ తాజాగా పేర్కొంది.

Also Read: Viral Video : పెళ్లి డ్రెస్సులోనే ఓటువేసిన పెళ్లికూతురు.. ఎక్కడంటే?

ఈ మెగా టోర్నీలో అమెరికాలో జరిగే మొత్తం మ్యాచుల ప్రమోషన్ బాధ్యతలను సిక్సర్ల కింగుకు అప్పచెప్పింది ఐసీసీ. ఇక టి20 ప్రపంచ కప్ ఐసీసీ రాయబారిగా ఎంపికైన సందర్భంగా యువరాజు స్పందించాడు. ఇందులో భాగంగా తాను ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టడం లాంటి ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు పొట్టి ప్రపంచ కప్పుతో తనకి ముడిపడి ఉన్నాయని.. ఇలాంటి మెగా ఈవెంట్లో మరోసారి భాగం కావడం నా అదృష్టం అంటూ పేర్కొన్నాడు.

Also Read: Stock Market Intraday: వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్..

అలాగే వరల్డ్ కప్ రాయబారిగా నా బాధ్యతలు నిర్వహించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ బడా ఈవెంట్లో టీమిండియా – పాకిస్తాన్ మ్యాచ్ పై యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ఈ ఏడాది ప్రపంచకప్ లో జరగబోయే అతిపెద్ద మ్యాచ్ గా ఆయన అభివర్ణించాడు. ఇక టి20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి 29 వరకు మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ ని కరేబియన్ దీవులు, అలాగే అమెరికా వేదికగా ఐసీసీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా గ్రూప్ A లో టీమిండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, కెనడా, ఐర్లాండ్ లు పోటీ పడనున్నాయి. జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.