Site icon NTV Telugu

Lebanon: అమెరికా ఎంబసీ దగ్గర కాల్పులు.. సిరియా వ్యక్తి అరెస్టు

Lebananu

Lebananu

లెబనాన్ రాజధాని బీరూట్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిరియన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని లెబనాన్ సైన్యం తెలిపింది.

ఇది కూడా చదవండి: BJP: రామ మందిర సీటును కోల్పోవడమే కాదు, గుడితో సంబంధం ఉన్న మరో వ్యక్తి కూడా ఓడిపోయాడు..

బుధవారం ఉదయం 8.30 గంటలకు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గరకు ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. ఎంబసీ సమీపంలో విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఎంబసీ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని సిరియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. భద్రతా సిబ్బంది తనను అవమానించినందుకు ప్రతీకారంగా కాల్పులు జరిపినట్లు నిందితుడు తెలిపాడు. కాల్పుల నేపథ్యంలో ఎంబసీ దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇది కూడా చదవండి: JR NTR: ఎన్టీఆర్ శుభాకాంక్షలు.. గాడిలో పెడతామంటూ బాలయ్య చిన్నల్లుడి రిప్లై

Exit mobile version