Site icon NTV Telugu

Syed Mushtaq Ali Trophy: ఉత్కంఠ పోరులో ఆంధ్ర జట్టు సంచలన విజయం.. మరోసారి నిరాశపరిచిన నితీష్ రెడ్డి..

Andhra Vs Punjab Smat

Andhra Vs Punjab Smat

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్-A మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పంజాబ్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం (డిసెంబర్ 14) పూణే వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆంధ్రకు మారంరెడ్డి హేమంత్ రెడ్డి అసాధారణ ఇన్నింగ్స్‌తో తొలి విజయాన్ని అందించాడు. కేవలం తన రెండవ SMAT మ్యాచ్ ఆడుతున్న 23 ఏళ్ల హేమంత్ రెడ్డి అజేయంగా 109 పరుగులు (53 బంతుల్లో, 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేసి జట్టును గెలిపించాడు. చివరి బంతి మిగిలి ఉండగానే ఆంధ్ర 211/5 పరుగులు చేసి ఛేదనను పూర్తి చేసింది.

AI Videos: ఏఐ సహాయంతో మహిళ అశ్లీల ఫోటోల సృష్టి.. ఆపై బ్లాక్‌మెయిల్.. చివరకు..?

భారీ ఛేజింగ్‌లో ఆంధ్ర జట్టుకు పేలవమైన ఆరంభం లభించింది. పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ (3/23) ధాటికి ఓపెనర్లు శ్రీకర్ భరత్ (1), అశ్విన్ హెబ్బార్ (4) తొలి ఓవర్‌లోనే ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ రికీ భూయ్ (15), నితీష్ కుమార్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు. దీనితో 9వ ఓవర్ నాటికే ఆంధ్ర 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పరాజయం దిశగా సాగింది.

Akhanda2 : అఖండ 2కు లాజిక్కులు అక్కర్లేదు, ఓన్లీ దైవత్వం : దిల్ రాజు

ఇక ఓటమి ఖాయమనుకున్న దశలో క్రీజులోకి వచ్చిన ఎస్‌డిఎన్‌వి ప్రసాద్ తో కలిసి హేమంత్ రెడ్డి చెలరేగి ఆడాడు. ఆరో వికెట్‌కు ఈ జోడి ఏకంగా 155 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రసాద్ 35 బంతుల్లో 53 పరుగులు చేసి హేమంత్‌కు అద్భుత సహకారం అందించాడు. వీరిద్దరూ పంజాబ్ బౌలర్లపై విరుచుకపడ్డారు. చివరకు జట్టును గెలిపించారు. సెంచరీతో అదరగొట్టిన హేమంత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

Exit mobile version