Site icon NTV Telugu

Switzerland: భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులు నిలిపివేత

Visa

Visa

స్విట్జర్లాండ్ వెళ్లాలనుకునేవారికి అలర్ట్.. భారత్ లోని స్విట్జర్లాండ్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు భారీగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం స్విస్ ఎంబసీల్లో సిబ్బంది కొరత ఉందని.. ఆ కారణంగా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో ఆలస్యమవుతోందని చెప్పారు. కేవలం భారతీయులకే కాకుండా చైనా పర్యాటకులకు ఈ షెంజెన్ వీసా దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు.. స్విట్జర్లాండ్ టూరిజం ఈస్ట్ మార్కెట్స్‌ సిమోన్ బాస్‌హార్ట్ పేర్కొంది.

Live-In RelationShip: సహజీవనంపై అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు..

ఈ పరిణామంపై స్విట్జర్లాండ్ విదేశీ వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ప్రస్తుతం తాము ప్రాసెస్ చేస్తున్న దరఖాస్తుల్లో 94 శాతం 2019 నాటివేనని తెలిపింది. ఇతర షెంజెన్ దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొంది. దీంతో ఆయా దేశాలు 2019 నుంచి తమ వీసా సామర్థ్యాన్ని పునరుద్ధరించలేకపోతున్నాయి’’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది.

ICC World Cup: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు.. ఒక్కరోజు ముందుగానే భారత్, పాక్ మ్యాచ్

27 ఐరోపా దేశాల సమాఖ్యను షెంజెన్‌ అంటారు. ఈ దేశాల మధ్య ప్రయాణించేందుకు, 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షెంజెన్‌ వీసాను జారీ చేస్తారు. ఏదైనా షెంజెన్‌ దేశం ఈ వీసాను జారీ చేస్తే.. దానిపై ఇతర షెంజెన్‌ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి ఉంటుంది.

Exit mobile version