Swayambhu : సంయుక్త ప్రిన్సెస్ లుక్ అదిరిపోయిందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నిఖిల్ ఫస్ట్ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. వారియర్ లుక్ లో నిఖిల్ కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచేసాడు.నిఖిల్ 20వ చిత్రం గా వస్తున్న ఈ మూవీ లో మలయాళ భామ సంయుక్తామీనన్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ప్రిన్సెస్ లుక్ ఒకటి మేకర్స్ షేర్ చేసారు.నిఖిల్ తన కోస్టార్‌ను విష్ చేస్తూ.. మా హీరోయిన్ సంయుక్తామీనన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆమె సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ ఏడాది మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవాలని ఆశిస్తున్నట్టు నిఖిల్ ట్వీట్ చేసాడు.. స్వయంభు చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు.
గతేడాది భీమ్లానాయక్‌తో సూపర్ హిట్ అందుకున్న సంయుక్తా మీనన్ ఈ ఏడాది విరూపాక్షతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.హీరో నిఖీల్ కెరీర్‌లో స్వయంభు సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.స్వయంభు చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.ఈ మూవీకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే స్వయంభు చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో యుద్ధ వీరుడిగా నటిస్తున్న నిఖిల్ ఇటీవల తన పాత్ర కోసం స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ లో ట్రైనింగ్ తీసుకోడానికి వియాత్నం వెళ్లారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!