Swayambhu Movie : కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. బాహుబలి, త్రిపుల్ ఆర్ వంటి ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ తన మ్యాజిక్ మార్కు చూపించనున్నారు. ఆ మధ్య నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో నిఖిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు.
Read Also:Ponnam Prabhakar : ప్రభుత్వం వైద్యంలో అనేక సంస్కరణలు చేపట్టింది
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ‘స్వయంభూ’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చిత్ర యూనిట్ తాజాగా సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్టూడియోకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి దిగిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఆయన ఎపిక్ అండ్ పవర్‌ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Read Also:Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె విమర్శలు..