ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసు విచారణ సందర్భంగా స్వాతి మలివాల్ కూడా కోర్టుకు చేరుకున్నారు. బిభవ్ కుమార్ ను ఇటీవల ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి నిర్భందించిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా బిభవ్ తరపు న్యాయవాది స్వాతి మలివాల్‌ను పలు పదునైన ప్రశ్నలు అడిగారు.
READ MORE: Maharashtra: ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు..
“స్వాతి మలివాల్ DCW చీఫ్ గా పనిచేశారు. ఆమెకు మహిళల హక్కుల గురించి బాగా తెలుసు. తన హక్కులకు భంగం కలిగితే వెంటనే ఫిర్యాదు చేసి ఉండాలి. ఎందుకు 3 రోజులు ఆలస్యం అయ్యింది? బిభవ్ తనను చాలాసార్లు (7-8 సార్లు) చెప్పుతో కొట్టాడని స్వాతి చెప్పారు. ఆమె చెప్పేది ఒక్క నిముషం నిజమే అనుకుందాం. అందులో ఐపీసీ సెక్షన్ 308 ఎక్కడ ఉంది?. నేరం చేయడానికి కారణం ఏమిటి? సంఘటన జరిగిన ప్రదేశాన్ని చూడండి. అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రోటోకాల్ అధికారులూ ఉన్నారు. స్వాతి మలివాల్ బిభవ్ కుమార్‌కు ఫోన్ చేసిందని అందరికీ తెలుసు. వైద్య పరీక్ష అదే రోజు చేయలేదు. సంఘటన జరిగిన 3-4 రోజుల విరామంలో AIIMS లో జరిగింది. నా 40 ఏళ్ల లా ప్రాక్టీస్‌లో ఈ తేదీకి సంబంధించిన 308 కేసును ఎప్పుడూ చూడలేదు.! ఢిల్లీ పోలీసులు ఇలాంటి కేసు పెట్టడం ఎప్పుడూ చూడలేదు.” అని బిభవ్ తరఫు న్యాయవాది వాధించారు.
“ఆమె ముఖ్యమంత్రి పిలుపు మేరకు వెళ్లారో లేదో మలివాల్ చెప్పలేదు. అనుమతి లేకుండా ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. ఆమెను సీఎం నివాసానికి ఎవరు పిలిచారు? ఆమె మనసులో ఏదో ఆలోచనతో వచ్చింది. అక్కడికి రాకముందే ముందస్తు ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు అతను బిభవ్‌తో మాట్లాడావా అని సెక్యూరిటీని పదే పదే అడిగాడు. బిభవ్‌ను పిలవాలని మలివాల్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అతను పిలిచారా? ఆమె బలవంతంగా లోపలికి వచ్చి ఇదంతా పథకం ప్రకారం చేశారు.” అని లాయర్ పేర్కొన్నారు.