Site icon NTV Telugu

Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న స్వామి స్వరూపానంద

Swaroopananda

Swaroopananda

Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానంద దర్శించుకున్నారు. స్వరూపానందతోపాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి స్వరూపానందకు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఈవో, ఛైర్మన్, వైదిక కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.

Also Read: YSRCP: లండన్‌లో వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం

దేవి నవరాత్రులకు దుర్గ గుడికి ప్రాముఖ్యత ఉందని స్వామి స్వరూపానంద తెలిపారు. చుట్టూ ఉన్న పక్క రాష్టాల నుంచి తండోపతండాలుగా భక్తులు వస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా శక్తి వంతమైనవారన్నారు. నిత్యం దేవి ఉపాసన శక్తితో పూజలు చేస్తున్న పండితులు ఉన్న ఏకైక దేవాలయం ఇంద్రకీలాద్రి అంటూ పేర్కొన్నారు. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు పేద భక్తులు ఎక్కువ ఉన్నారని.. అందరికీ దర్శనం లభించేలా చూసుకోవాలని మంత్రికి ఇతర ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నారు.

Also Read: TDP: జనసేనతో సమన్వయం కోసం టీడీపీ కో-ఆర్డినేషన్‌ కమిటీ

వీఐపీ దర్శనాల కోసం పాకులాడకుండా సాధారణ భక్తులకు దర్శనం దక్కే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదాయం సంపాదన పక్కన పెట్టి.. వీఐపీ దర్శనం సాధారణ భక్తులకు లభించే విధంగా చూడాలన్నారు ఎటువంటి వివాదాలు లేకుండా, భక్తులకు తప్పుడు అభిప్రాయాలు రాకుండా.. మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేయకుండా చూడాలన్నారు.

Exit mobile version