ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే కోట్లాది మంది నిరుద్యోగ యువతకు నిరాశే ఎదురవుతోంది. చదువు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న యువతకు విద్యా వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీలు, నియామకాలలో జరుగుతున్న అక్రమాలు పెద్ద శాపంగా మారాయి. అర్హత, ప్రతిభ ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం దక్కక లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలలు, ఆలస్యమవుతున్న నియామక ప్రక్రియలు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఉద్యోగం సాధించి తమ కుటుంబాలను ఆదుకోవాలనుకునే నిరుద్యోగుల ఆవేదన, వారి హక్కుల కోసం చేసే పోరాటాలు ఈనాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో పతంజలి యోగపీఠంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యోగా గురు స్వామి రామ్‌దేవ్ మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో విద్యార్థులు రోడ్డెక్కి చేస్తున్న నిరసనలు విద్యా వ్యవస్థ, ఉద్యోగ నియామకాలలోని తీవ్రమైన సమస్యలకు అద్దం పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, పుస్తకాలు, విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడం వల్లే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, కాపీయింగ్ ఉదంతాలు నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Also Read
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- 165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
- Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
Baba Ramdev ——
“Today in every field, there is chaos in our country”🥲
“The students are protesting as some find their shortage of teachers, some find there are paper leaks”😭♨️
“In interviews, only cast bias is predominant in giving marks”🥲
“Also, interview board are taking… pic.twitter.com/IWHfJw5UB9
— Prajjwal’s POV (@YPRAJJWAL) August 15, 2026
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రామ్‌దేవ్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలోనే అత్యధికంగా 90 శాతం వరకు అవినీతి జరుగుతోందని అన్నారు. కులం, సామాజిక వర్గం ఆధారంగా కొందరికి లబ్ధి చేకూరుస్తూ, అసలైన ప్రతిభావంతులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహం పెరిగి మరిన్ని ఆందోళనలకు దారితీయక ముందే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని హెచ్చరించారు. నిరసనల పేరుతో హింస, అరాచకాలను తాను సమర్థించనని, అయితే అవినీతి ఆరోపణలను తేలిగ్గా తీసిపారేయకూడదని ఆయన స్పష్టం చేశారు. అలాగే అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు శత్రువులుగా చూడకుండా పరస్పర గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!