Drinking Water: ప్రతిరోజు మన శరీరానికి అవసరమైనంత నీరు త్రాగాలి. తక్కువ నీరు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతిరోజూ ఎక్కువ నీరు తాగాలని గుర్తుంచుకోవాలి. మనం తక్కువ నీరు తాగితే శరీరంలో కొన్ని అనారోగ్య సంకేతాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనది కిడ్నీలో రాళ్ల ప్రమాదం. ఇవి చిన్న చిన్న ఇసుక రేణువుల సైజు నుంచి చిన్న నిమ్మకాయ సైజు వరకు పెరిగే అవకాశం ఉంది. నీటి కొరత వల్ల మూత్రపిండాల్లో రాళ్లుగా మారతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో నీరు లేనప్పుడు, మూత్ర పరిమాణం తగ్గుతుంది. మూత్రం శరీరంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సాంద్రీకృత మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, ఈ చిన్న స్ఫటికాలు పెద్ద రాళ్లుగా మారవచ్చు. దీని వల్ల విపరీత మైన నొప్పి, ఇతర సమస్యలను కలిగిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మూత్రం ఎక్కువసేపు అలాగే ఉండి.. దాని వల్ల స్ఫటికీకరణ ప్రక్రియ మొదలవుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, ఈ చిన్న స్ఫటికాలు పెద్ద రాళ్లుగా మారే ప్రమాదం ఉంది.
మూత్రపిండాల్లో రాళ్ల నివారణ:
మీరు తగినంత నీరు త్రాగితే, అది మూత్రంలో ఖనిజాలు, లవణాలను పలుచన చేస్తుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. అందువల్ల, ప్రతి రోజు తగిన మోతాదులో నీరు త్రాగటం చాలా ముఖ్యం. రోజంతా శరీరానికి కనీసం 8-10 గ్లాసుల నీరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల మూత్రం పలచబరుస్తుంది, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. కావున ఇన్ని సమస్యలకు మనం సరిగా నీళ్లు తాగకపోవడమే కారణం కాబట్టి, పుష్కలంగా నీటిని తాగితే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టి ఆరోగ్యంగా జీవించవచ్చు.
Kanpur Test: 233 పరుగులకు బంగ్లా ఆలౌట్.. సిక్సులతో రెచ్చిపోయిన రోహిత్!