Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Swachhta Hi Seva Program From 17th September To 2nd Of October Says Cs Neerabh Kumar Prasad

CS Neerabh Kumar Prasad: ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

Published Date :September 12, 2024 , 8:55 pm
By Mahesh Jakki
  • రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
  • ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
CS Neerabh Kumar Prasad: ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
  • Follow Us :
  • google news
  • dailyhunt

CS Neerabh Kumar Prasad: ఈనెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని విజయవతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ఈనెల 17న ప్రారంభమై పక్షం రోజుల పాటు అనగా గాంధీ జయంతి అక్టోబరు 2 వరకూ నిర్వహించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి సన్నాహక కార్యక్రమం ఈనెల14 నుండి ప్రారంభమవుతుందన్నారు. స్వచ్ఛతా హి సేవా ప్రచారం వివిధ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది పౌరులను సమీకరించడానికి రూపొందించబడిందని, ఈ ప్రచారం ప్రవర్తనలో భాగంగా స్వచ్ఛతను ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. రాబోయే స్వచ్ఛతా హి సేవ ప్రచారం 2024 కోసం సన్నాహకాలపై సీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలను ఈ నెల 17 నుంచి ప్రారంభించి పక్షం రోజుల పాటు నిర్వహించాలన్నారు.

Read Also: AP CM Chandrababu: సాధారణ విపత్తులా ఈ విపత్తును చూడకండి.. ఉదారంగా సాయం చేయండి..

17 సెప్టెంబర్ నుండి అన్ని జిల్లాలు, పట్టణ స్థానిక సంస్థలు క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ల (CTUలు) పరివర్తనను ప్రారంభించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల కేంద్రాల్లోను సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటై ప్రచారాన్ని పర్యవేక్షించడానికి ఒక నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు. ప్రచార కార్యకలాపాలు, ఉత్తమ అభ్యాసాలను హైలైట్ చేయడానికి, పౌరులు, లబ్ధిదారుల వాయిస్‌లను విస్తరించడానికి జిల్లాలు, యూఎల్‌బీలు, రాష్ట్రంలో ప్రతిరోజు అప్‌డేట్‌లు, ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు, విజయాలను పోస్ట్ చేయడానికి నిరంతరం పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అన్ని శాఖలు ఈకార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా పౌరులను పెద్దఎత్తున భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత, పరిశుభ్రతను పెంపొందించడానికి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.అనంత రాము, అనిల్ కుమార్ సింఘాల్, ఎం.టి.కృష్ణ బాబు, ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, కాంతిలాల్ దండే, స్వచ్చాంధ్ర కార్పొరోషన్ ఎండీ గంధం చంద్రుడు, తదితర అధికారులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap news
  • CS Neerabh Kumar Prasad
  • Swachhta Hi Seva program
  • telugu news

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions