NTV Telugu Site icon

Safest SUVs: ADAS ఫీచర్‭తో సురక్షితమైన SUV కారులు ఇవే..

Svu

Svu

Safest SUVs: ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా SUV లు అందుబాటులో ఉన్నాయి. ఇవి లుక్స్, స్టైల్ కాకుండా భద్రత పరంగా కూడా చాలా మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో భద్రతా లక్షణాలను ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ADAS (ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్‌ తో వచ్చిన కొన్ని SUVs గురించి చూద్దాం.

MG ఆస్టర్:

MG ఆస్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన భారతదేశపు మొట్టమొదటి SUV. ఈ SUVలో లెవెల్ 2 ADAS ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ను సురక్షితంగా, ప్రయాణం సులభంగా మార్చడానికి సహాయపడతాయి. MG ఆస్టర్‌లో I-SMART 2.0తో 80కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్లు ఉన్నాయి. ఈ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు.

Also Read: SA vs PAK: పాకిస్తాన్ పై గెలుపుతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న దక్షిణాఫ్రికా

హోండా ఎలివేట్:

హోండా ఎలివేట్ ఒక మిడ్-సైజ్ SUV. ఇందులో ADAS టెక్నాలజీ, హోండా సెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు టాప్ స్పెక్ ట్రిమ్‌లో అందుబాటులో ఉంటాయి. హోండా ఎలివేట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ వెన్యూ:

హ్యుందాయ్ వెన్యూలో లెవెల్ 1 ADAS మాత్రమే అందించబడింది. ఇది స్మార్ట్ SUV. ఇది 20.32 సెం.మీ హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ ఇంకా అనేక కనెక్ట్ చేయబడిన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7 లక్షల 94 వేల నుండి ప్రారంభమవుతుంది.

కియా సెల్టోస్:

కియా సెల్టోస్ 10 లక్షల 89 వేల రూపాయల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో లెవల్ 2 ADAS మద్దతు అందించబడింది. సెల్టోస్‌లో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 8 అంగుళాల స్మార్ట్ హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read:Game Changer First Review: గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోండమ్మా!

హ్యుందాయ్ క్రెటా:

హ్యుందాయ్ క్రెటా, ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల 99 వేల నుండి ప్రారంభమవుతుంది. ఈ SUVలో 10.25″ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్రెటా హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్ లెవెల్-2 ADAS‌తో వస్తుంది. ఇది భద్రతను మరింత పెంచుతుంది. ఈ SUVsలో ADAS ఫీచర్లను ఉపయోగించడం వల్ల, కారును నడపడం మరింత సురక్షితంగా మారుతుంది. మీరు కూడా కొత్త SUV కొనుగోలు చేయాలనుకుంటే, ఈ కార్లు మీకు చాలా మంచి ఎంపికలు కావచ్చు.

Show comments