Accident: గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ యువకుడు బైక్ రైడర్ మృతి చెందాడు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ ఎస్‌యూవీ కారు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తోంది. అయితే., అతివేగంతో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన సెప్టెంబర్ 15 (ఆదివారం) ఉదయం 5.45 గంటలకు జరిగింది. అయితే ఈ భయానక వీడియో తాజాగా బయటకు వచ్చింది. రైడర్ ను న్యూఢిల్లీలోని ద్వారకలోని పోచన్ పూర్ నివాసి అక్షత్ గార్గ్ గా గుర్తించారు. అతను మోటార్‌సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్, గ్లోవ్స్‌తో సహా సేఫ్టీ గేర్‌ను ధరించాడు. ఢీకొన్న వెంటనే అక్షత బైక్‌పై నుంచి ఎగిరిపడి రోడ్డుపై పడ్డాడు. అంబులెన్స్ త్వరగా వచ్చినప్పటికీ, అక్షత్ గార్గ్‌ను రక్షించలేకపోయారు.
Boat Crash: నదిలో బోటు బోల్తా.. ఘటన సమయంలో బోటులో 16 మంది..
అక్షత్ స్నేహితుడు, 22 ఏళ్ల ప్రద్యుమన్ కుమార్ కూడా అదే రహదారి గుండా వెళుతున్నాడు. అతను మరో బైక్‌పై వెళ్తుండగా, మృతుడు అక్షత వెనుక నుంచి వస్తున్నాడు. ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియో అతని స్నేహితుడి గోప్రో కెమెరాలో రికార్డు అయ్యింది. మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఎస్‌యూవీ డ్రైవర్ కుల్దీప్ కుమార్ ఠాకూర్ ఘిటోర్ని నివాసి. అతను PR కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. వీడియో చూస్తే.. ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shocking video from Gurugram shows a head-on collision between a bike and an SUV.
The SUV was running on the wrong side of the road. The man riding the bike was killed in the accident. He has been identified as 23-year-old Akshat Garg.
The driver of the SUV, Kuldeep Thakur,… pic.twitter.com/xjNs0QOWhq
— Vani Mehrotra (@vani_mehrotra) September 20, 2024