Hyderabad: హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్‌లో మనీషా (22) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం సంపత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న మనీషా, ప్రస్తుతం రామంతాపూర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే గత రాత్రి ఆమె అనుమానాస్పదంగా మరణించడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
Read Also: Yadagirigutta: ఘనంగా జరగనున్న బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకం.. పాల్గొననున్న సీఎం
మనీషా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆమె భర్త సంపత్ వేధింపులే మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. మనీషా తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలు కాస్త ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. చూడాలి మరి పొలిసు అధికారులు ఈ కేసును ఎంత త్వరగా చేధిస్తారో.