Site icon NTV Telugu

Crime News: భర్తపై అనుమానంతో భార్య ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే?

Wife

Wife

Crime News: అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాటిపర్తి పంచాయితీ కాశీపురం గ్రామంలో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Read Also: Valentine Day: ప్రేమ ముసుగులో వేధిస్తే బడితపూజ.. లాఠీలకు నూనె రాసి సిద్ధం చేసిన క్రాంతిసేన..

కాశీపురం గ్రామానికి చెందిన అల్లంగి లక్ష్మి అదే గ్రామానికి చెందిన అల్లంగి పోతురాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో.. పోతురాజు భార్య చిన్నమ్మ శుక్రవారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో లక్ష్మీ ముఖానికి, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌కి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version