Site icon NTV Telugu

Jammu Kashmir: అవినీతి కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

Jk

Jk

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి కేసులో బుద్గాం అదనపు పోలీసు సూపరింటెండెంట్ గౌహర్ అహ్మద్ ఖాన్, ఇటీవల అరెస్టయిన డీఎస్పీ ఆదిల్ ముస్తాక్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ హోం శాఖ ఆదివారం జారీ చేసింది.

Read Also: S Jaishankar: “ఇస్రో చంద్రయాన్ లాగానే”.. భారత్-అమెరికా బంధంపై జైశంకర్..

అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్లు 7, 7A, సెక్షన్లు 167, 193 కింద వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు సెప్టెంబర్ 21 నుంచి డీఎస్పీ ఆదిల్ ముస్తాక్‌పై సస్పెన్షన్‌ విధించనున్నట్లు జమ్మూ కాశ్మీర్ హోం శాఖ పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 201, 210, 218, 221 కింద నౌగామ్‌ పోలీస్ స్టేషన్ లో అతన్ని అరెస్టు చేశారు.

Read Also: Big Breaking: తెలంగాణకు పసుపు బోర్డు.. ములుగు జిల్లాకు సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ

ఇదిలా ఉండగా.. ఒక ప్రత్యేక క్రమంలో బుద్గామ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ గౌహర్ అహ్మద్ ఖాన్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. అతని ప్రవర్తనపై విచారణ పెండింగ్‌లో ఉందని పేర్కొంది. సస్పెన్షన్ వ్యవధిలో అధికారులు జోనల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, కాశ్మీర్‌కు అటాచ్ అవుతారని హోంశాఖ ఆదేశించింది.

Exit mobile version