NTV Telugu Site icon

Vizag Steel Plant EOI Bidding : విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఈవోఐపై ఉత్కంఠ..

Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant EOI Bidding : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ)పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. సింగరేణి కాలరీస్ భాగస్వామ్యంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కార్మిక సంఘాలు.. EOIకి సిద్ధమేనని ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి లేఖ సమర్పించింది సింగరేణి.. అయితే, ఆన్ లైన్ విధానంలో బిడ్ దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది.. దీంతో, సింగరేణి కాలరీస్ నిర్ణయం కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు.. EOIపై సింగరేణి వైఖరి ఆధారంగా మరిణామాలు మారిపోనున్నాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ EOIపై కార్మిక సంఘాల అసంతృప్తిగా ఉన్నారు.. ప్రైవేట్‌ స్టీల్ కంపెనీలకు దొడ్డిదారిన కట్టబెట్టే ప్రయత్నంగా జేఏసీ మండిపడుతోంది.. సింగరేణి, NMDC, సెయిల్ ఆధ్వర్యంలో EOIకి అంగీకరించాలని నిర్ణయిచింది.. నేటి సాయంత్రంతో గడువు ముగియనుండడంతో.. రేపు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీకానుంది.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది పోరాట కమిటీ.. మరోవైపు.. ఈనెల 26వ తేదీన స్టీల్ ప్లాంట్ దగ్గర వామపక్ష పార్టీల బహిరంగ సభ నిర్వహించనున్నాయి.. ఈ సభను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరుకానున్నారు.. మే 3న ఏపీలో రాస్తారోకోలకు అఖిలపక్షం సన్నాహాలు చేస్తోంది.

Read Also: IPL 2023: నేడు కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ.. వార్నర్‌ సేన బోణీ కొట్టేనా?

అయితే, ఈ నెల 15వ తేదిన ఈవోఐకు సంభందించి చివరి తేది అని స్టీల్ ప్లాంట్ ప్రకటించినప్పటికీ.. ఇంకొన్ని సంస్థలు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడంతో, ఈ నెల 20వ వరకు గడువు పెంచిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ బిడ్డింగ్ లో పాల్గొంటుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 22 సంస్థలు ముందుకు రాగా.. అందులో 6 విదేశీ సంస్థలు, 16 దేశీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనేది ఉత్కంఠగా మారిపోయింది.