Ongole MP Candidate: ఒంగోలు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ఈ స్థానం నుంచి అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.. అయితే, చెవిరెడ్డిని బరిలోకి దింపితే సహకరించలేనని అధిష్టానానికి స్పష్టం చేశారట.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలి.. కాకుంటే జిల్లాలో మరొకరికి సీటు కేటాయించాలని కోరారట.. మొదటి నుంచి మాగుంట కోసం పట్టుబడుతూ వస్తున్నారు బాలినేని.. అధిష్టానం మాత్రం దీనికి అంగీకరించడం లేదు.. ఇక, బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంతనాలు జరిపినా.. వ్యవహారం కొలిక్కిరాలేదు.. మరోవైపు.. ప్రత్యామ్నాయం వైపు మాగుంట అడుగులు వేస్తుండడంతో.. ఏం జరుగుతుందోనని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నాయి..
Read Also: Tollywood Movies: సంక్రాంతికి వచ్చి భారీ కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాలు ఇవే..
ఎంపీ మాగుంటకు సీటు కేటాయించకపోతే.. ఇంక ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడేది లేదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది.. మాగుంట అయితే పలు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేయగలరని బాలినేని భావిస్తున్నారట.. మొదటి నుంచి మాగుంట కోసం పట్టుబడుతూ వస్తుండగా.. అధిష్టానం మాత్రం ససేమిరా అంటోంది.. బాలినేనిని కలసి మంతనాలు జరిపినా వ్యవహారం కొలిక్కి రాకపోవడం ఓవైపు.. ప్రత్యామ్నాయం వైపు ఎంపీ మాగుంట అడుగుల నేపథ్యంలో.. జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. కీలక మార్పులు చేసింది.. ఐదో లిస్ట్‌ను ఫైనల్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.