Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన పార్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఢిల్లీ పెద్దల నుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం. దీనితో ఆ దిశగా ఆలోచించాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి పేరుపై సస్పెన్స్ మరింత పెరిగింది. ప్రస్తుతం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ పేర్లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Viral Video: తాకరాని చోట తాకిన బంతి.. అల్లాడిపోయిన కేఎల్ రాహుల్!
ఇదే సమయంలో తెరపైకి కొత్త పేర్లు కూడా వస్తున్నాయి. పార్టీకి వెలుపల ఉన్న బొంతు రామ్మోహన్, విక్రమ్ గౌడ్ పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. విక్రమ్ గౌడ్ బీజేపీ కీలక నేతలతో మాట్లాడి, అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని తెలిపినట్టు సమాచారం. అయితే, తాను ఎవరితోనూ టచ్‌లో లేనని బొంతు రామ్మోహన్ స్పష్టంచేశారు. మరోవైపు పార్టీలో ఉన్న కొందరు మహిళా నేతలు కూడా ఈ సీటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ప్రకటన ఈ రోజు వెలువడుతుందా లేదా అన్నది ఇంకా సందిగ్ధంగానే ఉంది.
Maganti Sunitha: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు
