Suryaputra Karna : కర్ణుడి పాత్రలో చియాన్ విక్రమ్.. టీజర్ అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’లో ఆదిత్య కరికాలన్‌గా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా చియాన్ విక్రమ్ పా.రంజిత్ ప్రయోగాత్మక చిత్రం ‘తంగళన్’ షూటింగ్‌ను కూడా ముగించాడు.ఆ తర్వాత చియాన్ ఏ కొత్త చిత్రాన్ని కూడా ఒప్పుకోలేదు..విక్రమ్ తన తరువాత సినిమా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు విక్రమ్ అభిమానులకు స్వీట్ న్యూస్ అందింది. దర్శకుడు ఆర్.ఎస్.విమల్ మెగా ఎపిక్ ‘సూర్యపుత్ర కర్ణ’ చిత్రీకరణ త్వరలో పునఃప్రారంభించనున్నట్లు తన ఫేస్‌బుక్ పేజీలో అధికారికంగా ప్రకటించారు. విక్రమ్ టైటిల్ రోల్‌లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లి కొన్ని యుద్ధ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ అప్పట్లో రకరకాల కారణాలతో కొన్నేళ్లుగా చిత్రీకరణ ఆగిపోయింది.విక్రమ్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసాడని ప్రచారం కూడా జరిగింది.అయితే దర్శకుడు ఆర్.ఎస్ విమల్ తన ఫేస్‌బుక్‌లో ‘సూర్యపుత్రన్ కర్ణన్ రోలింగ్ త్వరలో’ అనే సందేశాన్ని విక్రమ్ స్టిల్‌తో పోస్ట్ చేసాడు.
ఈ చిత్రంలో ఫుటేజ్ నుండి ఫోటోగ్రాఫ్ బయటికి రాగానే అంతటా ఆసక్తి ఏర్పడింది. ప్రొడక్షన్ హౌస్ మిగిలిన నటీనటులు- సిబ్బందికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.. మరోవైపు కర్ణకు సంబంధించిన తాజా వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ వీడియోని చూస్తుంటే బాహుబలి ని మించి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని కర్ణ సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది. పొన్నియన్ సెల్వన్ క్లాసీ సినిమా. ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్లను మించి కథ కీలకంగా సాగుతుంది.. కానీ మహాభారతంలోని కర్ణుడి పాత్రతో భారీ వార్ ఎపిసోడ్స్ తో సాగుతుంది. దీనితో తమిళ తంబీలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు… ఈ చిత్రం కోసం విక్రమ్ ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ అలాగే విజువల్ గ్రాఫిక్స్ షాట్స్ కానీ ఎంతో గ్రాండ్ గా ఆసక్తిని కలిగిస్తున్నాయి. వరల్డ్ క్లాస్ వారియర్ సినిమాని తెరకెక్కించాలన్న ఉద్దేశం ఈ విజువల్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే చియాన్ విక్రమ్ ఎప్పుడో మొదలు పెట్టిన సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న డిలే ప్రాజెక్ట్ ‘ధృవ నచ్చతిరమ్’ సినిమాను నవంబర్ 20 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
Also Read
- భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
తాజావార్తలు
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
-
AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!