NTV Telugu Site icon

Devisha Shetty: “నా బెస్ట్ ఫ్రెండ్, భర్త, ప్రేమికుడు, నా ప్రపంచం” పుట్టిన రోజు శుభాకాంక్షలు..

Surya

Surya

ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం (సెప్టెంబర్ 14) 34వ ఏట అడుగుపెట్టాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్‌కి అభిమానులు తమదైన శైలిలో విషెస్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సూర్య భార్య దేవిషా శెట్టి తన భర్త పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నిండిన ఓ పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవిష పెట్టిన పోస్ట్‌కి సూర్య ఒక్క మాటలో సమాధానమిచ్చి తన భావాలను మొత్తం బయటపెట్టాడు.

Palla Srinivas: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..!

ఇన్‌స్టాగ్రామ్‌లో తాను మరియు సూర్యకుమార్‌కు సంబంధించిన ఫోటోలను దేవిషా పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. “నా బెస్ట్ ఫ్రెండ్, భర్త, ప్రేమికుడు, నా ప్రపంచం మరియు నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు!.” అని రాసుకొచ్చింది. “మీరు భారతదేశాన్ని మంచి ప్రదేశంగా మార్చారు. మీరు లేకుండా నేను ఏమి చేస్తానో నాకు తెలియదు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను.” అని సూర్య రాసింది. దీనికి.. సూర్య దేవిషా పోస్ట్‌పై ‘రిలాక్స్’ అని రాశారు.

Rohit Sharma: సెహ్వాగ్ రికార్డుకు దగ్గర్లో ‘హిట్ మ్యాన్’.. టెస్ట్ క్రికెట్‌లోనే

సూర్య, దేవిషా ముంబైలో వివాహం చేసుకున్నారు. ఎ. పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత జూలై 7, 2016న పెళ్లి చేసుకున్నారు. దులీప్ ట్రోఫీ 2024లో సూర్య ఫిట్‌గా లేనందున రెండో రౌండ్‌లో ఆడటం లేదు. మొదటి రౌండ్‌లో ఇండియా సి జట్టు తరుఫున ఆడాడు. కానీ చేతికి గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుచ్చిబాబు టోర్నీలో ముంబై తరఫున ఆడిన సూర్య చేతికి గాయమైంది.

Show comments