SRH vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌.. ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ!

Mi Ipl

Mi Ipl

Suryakumar Yadav to miss IPL 2024 SRH vs MI Match: బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి సూర్యకు ఇంకా ఎన్‌ఓసీ దక్కలేదని తెలుస్తోంది. దాంతో గుజరాత్‌ మ్యాచ్‌కు దూరమైన సూర్యకుమార్‌.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం.

సూర్యకుమార్‌ యాదవ్‌ అందుబాటులో ఉండేది లేనిది మంగళవారం సాయంత్రం లోగా తెలియరానుంది. సాయంత్రం లోగా సూర్యకు ఎన్‌సీఏ ఎన్‌ఓసీ ఇ‍వ్వకపోతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు మిస్టర్ 360 అందుబాటులో ఉండడం దాదాపుగా అసాధ్యమే. గుజరాత్‌తో మ్యాచ్‌లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతడు ఉండివుంటే ముంబై సునాయాసంగా గెలిచేది. రేపటి మ్యాచ్‌కు కూడా అతడు దూరమైతే.. ముంబై విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

Also Read: IPL 2024: ఆర్‌సీబీ ఆటగాడిపై భారత మాజీ క్రికెటర్‌ వ్యాఖ్యలు.. గట్టిగా ఇచ్చిపడేసిన బెంగళూరు ఫ్రాంచైజీ!

సూర్యకుమార్‌ యాదవ్ గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్య ఎన్‌సీఏ వైద్య బృదం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు ఐపీఎల్‌ ఆడాలంటే ఎన్‌సీఏ వైద్యుల అనుమతి తప్పనిసరి. వారు ఎన్‌ఓసీ ఇస్తేనే ఐపీఎల్‌ ఆడేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది. ఐపీఎల్‌లో 139 మ్యాచులు ఆడిన సూర్య.. 3249 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్య చాలా ఏళ్లుగా ముంబైకి ఆడుతున్న విషయం తెలిసిందే.