Site icon NTV Telugu

Suryakumar Yadav: కెప్టెన్సీ పై మొదటిసారి స్పందించిన సూర్య..

Surykumar Yadav

Surykumar Yadav

Suryakumar Yadav: శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కు భారత జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నియమించింది. తద్వారా హార్దిక్ పాండ్యాకు ఈ స్థానం అప్పగించబడుతుందనే అనేక ఊహాగానాలకు తెరపడింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత.. పొట్టి ఫార్మాట్‌ లో సూర్యకుమార్‌ ను భారత శాశ్వత కెప్టెన్‌గా నియమిస్తారా లేదా అనే దానిపై అధికారిక ధృవీకరణ లేదు. ఏది ఏమైనప్పటికీ, హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నప్పటికీ అతని కంటే ముందుగానే అతను ఈ పదవికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టి20 లలో బ్యాటింగ్ లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.

Uttarpradesh : గుడిసెను ఢీకొట్టిన ట్రక్కు.. కడుపు పగిలి గర్భిణితో సహా కుటుంబం మొత్తం మృత్యువాత

ఇకపోతే తాజాగా సూర్య కెప్టెన్‌గా ఎన్నికైన తర్వాత మొదటిసారి స్పందించాడు. ఇందులో భాగంగా.. మీ నుండి ప్రేమ, మద్దతు కోరుతున్నాని.. శుభాకాంక్షలను తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు అంటూ తెలిపాడు. గత కొన్ని వారాలు ఒక కల కంటే తక్కువ కాదు., ఇక నేను నిజంగా కృతజ్ఞుడను.. దేశం కోసం ఆడటం అనేది నేను మాటల్లో వర్ణించలేని అత్యంత ప్రత్యేకమైన అనుభూతి. ఈ కొత్త పాత్ర తనతో పాటు చాలా బాధ్యత, ఉత్సాహం తెస్తుంది. మీ మద్దతు, ఆశీర్వాదాలను ఇలాగే కొనసాగించాలని నేను ఆశిస్తున్నానట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ కీర్తి అంతా భగవంతుడికి చేరుతుంది, భగవంతుడు గొప్పవాడు అంటూ ఓ పోస్ట్ లో పేర్కొన్నాడు.

NEET UG 2024 : నీట్ యూజీ ఫలితాలు విడుదల

Exit mobile version