NTV Telugu Site icon

Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్ సంచలన నిర్ణయం!

Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav To Play Buchi Babu Tournament: టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో సూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024 బుచ్చి బాబు టోర్నమెంట్‌లో ముంబై తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు రంజీ ట్రోఫీ సీజ‌న్‌లో కూడా మిస్టర్ 360 ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రెండు టోర్నీల్లో రాణించి.. భార‌త్ త‌ర‌పున టెస్టుల్లో పున‌రాగ‌మ‌నం చేయాల‌ని సూర్య భావిస్తున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ భారత్ త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2023 బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సూర్య టెస్టు అరంగేట్రం చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆపై గాయం కార‌ణంగా సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత సూర్యకి టెస్టుల్లో ఆడే అవ‌కాశం ల‌భించలేదు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సూర్య.. తనకు మూడు ఫార్మాట్లలో ఆడాలన్న కోరికను బయటపెట్టాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్న‌మెంట్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని సూర్య చెప్పాడు.

Also Read: Samantha-Fan: ప్ర‌పోజ్ చేసిన అభిమాని.. ఓకే చెప్పిన సమంత! వీడియో వైర‌ల్‌

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సూర్యకుమార్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 137 ఇన్నింగ్స్‌ల్లో 63.74 స్ట్ర‌యిక్ రేటుతో 5628 ప‌రుగులు చేశాడు. ఇందులో 14 సెంచ‌రీలు, 29 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. భారత హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌, బీసీసీఐ సూర్యను కేవలం టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే పరిగణించారు. అందుకే భారత టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. లంకతో టీ20లు ఆడిన సూర్యకు వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో సూర్య మూడు ఫార్మాట్ల ఆడాలనకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే వన్డే సహా టెస్ట్ ఫార్మాట్‌లో సూర్యకు మంచి రికార్డు లేదు.