Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం!
- బుచ్చి బాబు టోర్నమెంట్‌లో సూర్య
- రంజీ ట్రోఫీ సీజన్‌లో కూడా
- ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav To Play Buchi Babu Tournament: టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో సూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024 బుచ్చి బాబు టోర్నమెంట్‌లో ముంబై తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు రంజీ ట్రోఫీ సీజన్‌లో కూడా మిస్టర్ 360 ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టోర్నీల్లో రాణించి.. భారత్ తరపున టెస్టుల్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ భారత్ తరపున ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సూర్య టెస్టు అరంగేట్రం చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆపై గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత సూర్యకి టెస్టుల్లో ఆడే అవకాశం లభించలేదు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సూర్య.. తనకు మూడు ఫార్మాట్లలో ఆడాలన్న కోరికను బయటపెట్టాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని సూర్య చెప్పాడు.
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
Also Read: Samantha-Fan: ప్రపోజ్ చేసిన అభిమాని.. ఓకే చెప్పిన సమంత! వీడియో వైరల్
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సూర్యకుమార్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 137 ఇన్నింగ్స్‌ల్లో 63.74 స్ట్రయిక్ రేటుతో 5628 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సూర్యను కేవలం టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణించారు. అందుకే భారత టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. లంకతో టీ20లు ఆడిన సూర్యకు వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో సూర్య మూడు ఫార్మాట్ల ఆడాలనకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే వన్డే సహా టెస్ట్ ఫార్మాట్‌లో సూర్యకు మంచి రికార్డు లేదు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!