Suryakumar Yadav: భారత్ టీ20 వరల్డ్ కప్పు 2026ను సొంతం చేసుకుంది. మూడు సార్లు వరల్డ్ కప్పును ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు అద్భుతంగా రాణించింది. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే.. నేటితో సూర్య మరో మైలురాయిని చేరుకున్నారు. మార్చి 14 (శనివారం)తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఐదేళ్లు పూర్తి చేసుకున్నాడు. తన ప్రయాణానికి సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియోను సూర్య ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశాడు. “ఐదేళ్ల కిందట నా కల సహకారమైంది. టీమిండియా జెర్సీని ధరించినప్పుడు నాకు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేదనిది. భారత జట్టు కోసం మరిన్ని అద్భుత జ్ఞాపకాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని క్యాప్షన్‌లో పేర్కొన్నాడు.
సూర్యకుమార్ 2021 మార్చి 14న, 30 ఏళ్ల 181 రోజుల వయసులో ఇంగ్లాండ్‌పై అహ్మదాబాద్ వేదికగా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆశ్చర్యకరంగా, అదే అహ్మదాబాద్ వేదికగానే కెప్టెన్‌గా భారత్‌కు మూడో టీ20 ప్రపంచకప్‌ను అందించి చరిత్ర సృష్టించాడు. సొంత గడ్డపై కప్ గెలిచిన తొలి జట్టుగా, టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా భారత్‌ను నిలిపాడు. గడిచిన ఐదేళ్లలో సూర్య టీ20ల్లో తిరుగులేని ప్రయాణం సాగించాడు. 113 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలతో 3272 పరుగులు కూడగట్టుకున్నాడు. జట్టు కష్టా్ల్లో ఉన్నప్పుడు అనేక సార్లు ఆదుకున్నాడు. రోహిత్ శర్మ (4231), విరాట్ కోహ్లీ (4188) తర్వాత భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా సూర్య నిలిచాడు. 30 ఏళ్లు దాటిన తర్వాత ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికీ.. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణించాడు. అరంగేట్రం చేసిన ఏడాదిలోనే (2022) ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం విశేషం.
5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳
Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ
— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026
