Site icon NTV Telugu

Suryakumar Yadav: అభిషేక్ శర్మ ఆడాలని పాక్ కోరుకుంటే, అలానే కానివ్వండి..

Sky

Sky

Suryakumar Yadav: అనారోగ్య కారణాల వల్ల భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్తాన్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా.? లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 15న ఆదివారం కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్‌కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అభిషేక్ శర్మ ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Valentine’s Day: వాలెంటెన్స్ డే విషాదం.. కారులో లవర్స్ మృతదేహాలు.. అసలేం జరిగింది..

పాక్ కెప్టెన్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ..‘‘అభిషేక్ శర్మ ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటే, అతను ఆడుతాడు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ తో మ్యాచ్‌కు ముందు భారత జట్టు అభిషేక్ శర్మ ఆడటంపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ ఆస్పత్రిలో చేరారు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, అభిషేక్ శర్మ గురించి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అతను గుడ్ ప్లేయర్ అని అందరికి తెలుసు. అతను రేపు ఆడాలని ఆశిస్తున్నాను. మేము వారి ఉత్తమ జట్టుతో ఆడాలని కోరుకుంటున్నాము. అతను కోలుకుంటున్నాడని, రేపు ఆడగలడని ఆశిస్తున్నాను’’ అన్నారు.

Exit mobile version