NTV Telugu Site icon

Surya Kumar Yadav: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. ‘సూరీడు’ని ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే!

Surya Kumar Yadav

Surya Kumar Yadav

సూర్యకుమార్‌ యాదవ్ నాయకత్వంలోని భారత్.. టీ20ల సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికాకు భారత్ వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. పొట్టి ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియాదే ఆధిక్యం అయినా.. ఈసారి మాత్రం గట్టి పోటీనిచ్చేందుకు ప్రెషన్ టీమ్‌ సిద్ధంగా ఉంది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ ‘సూరీడు’ని పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

# సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికాపై ఏడు మ్యాచుల్లో 346 పరుగులు చేశాడు. మరో 107 పరుగులు చేస్తే.. భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచుల్లో అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (452) సూర్య కంటే ముందున్నాడు.

# ఈ సిరీస్‌లో సూర్యకుమార్ మరో 6 సిక్స్‌లు కొడితే.. టీ20ల్లో 150 సిక్సర్ మార్క్‌ను అందుకుంటాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (205), మార్టిన్ గప్తిల్ (173) ముందున్నారు. ప్రస్తుతం సూర్య 144 సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. నికోలస్‌ పూరన్ (144) నాలుగు స్థానంలో కొనసాగుతున్నాడు.

# సూర్యకుమార్‌ యాదవ్ టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్ (5), రోహిత్ శర్మ (5) ముందున్నారు. దక్షిణాఫ్రికాపై ఓ సెంచరీ చేస్తే.. వారితో సమంగా సూర్య నిలుస్తాడు. రెండు శతకాలు చేస్తే.. అగ్ర స్థానంకు దూసుకెళ్తాడు.

Also Read: WPL 2025: 24 మంది క్రికెటర్లను వదిలేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ ఇదే!

సూర్యకుమార్‌ యాదవ్ 2021లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 74 టీ20లు ఆడిన సూరీడు.. 2,544 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 169.48 స్ట్రైక్‌రేట్‌, 42.4 యావరేజ్‌తో రన్స్ చేశాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం సూర్య టీ20 పగ్గాలు అందుకున్నాడు.