Site icon NTV Telugu

Surya Jyothika Diwali Celebrations : సూర్య ఇంట్లో రాధికా శరత్ కుమార్.. బుల్లెట్ సాంగ్ కి స్టెప్పులు

Surya

Surya

Surya Jyothika Diwali Celebrations : సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ హీరో సూర్య నివాసంలో జరిగిన దీపావళి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు విశేషాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూర్య, కార్తీ, బృందంతో దీపావళి పండుగ సరదాగా జరుపుకున్నట్లు రాసుకొచ్చారు. సూర్య, కార్తీ ఫ్యామిలీలతో కలసి ‘కమాన్ బేబీ లెట్స్ గో బుల్లెట్టు’ అనే సాంగ్కి డాన్స్ వేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Also: Actress Prema: ఆయనంటే చాలా భయం.. వామ్మో డైరెక్ట్‎గా చూడటమే

సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలెబ్రెటీలు ఈ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు చాలా మంది సెలెబ్రెటీలు పండుగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తమ ఫీలింగ్ ను అందరితో పంచుకుంటున్నారు. అంతేకాకుండా శివకుమార్, సూర్య, కార్తీ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు. వీటితో పాటు వేడుకలో సరదాగా గడిపిన వీడియోలను కూడా షేర్ చేశారు రాధిక. ఎప్పుడూ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండే వీరు ఇలా సంతోషంగా దీపావళి పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: nayanathara surrogacy issue: నయన్ సరోగసి వివాదం.. నివేదికలో ఉన్నదిదే

హీరో సూర్య ‘జై భీం’ సినిమా తో మంచి సక్సెస్ ను అందుకున్నారు. తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్’ లో నటించారు. ఈ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ కాకపోయినా డ్రగ్స్ మాఫియా డాన్ గా చివరి 5 నిమిషాల్లో కనిపించి సినిమాకే హైలెట్ గా నిలిచారు. సూర్య తమ్ముడు కార్తీ దీపావళి సందర్భంగా ‘సర్దార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ఖైదీ మూవీ సీక్వెల్ కూడా త్వరలో రాబోతోంది.

Exit mobile version