NTV Telugu Site icon

Suriya 44 : గుమ్మడికాయ కొట్టేశారుగా.. సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ షూటింగ్ పూర్తి

New Project (78)

New Project (78)

Suriya 44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న అవైటెడ్ మూవీ “కంగువ”. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Read Also:Vardhan Puri: హైదరాబాద్‌లో అమ్రీష్ పురి మనవడు.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే.. టాలీవుడ్‌లో మెరుస్తాడా?

ఈ క్రమంలోనే సూర్య మరో సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టి పూర్తి కూడా చేశారు. సూర్య తన తరువాత సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం సూర్య కెరీర్ లో 44 వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ సినిమా షూటింగ్ జూన్ 2 న గ్రాండ్ గా మొదలైంది. ఈ సినిమాలో సూర్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాలో సూర్య పాత్రను ఎంతో డిఫరెంట్ గా డిజైన్ చేశారని టాక్. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగనుందని సమాచారం. ఈ సినిమాలో సూర్య వింటేజ్ లుక్ లో లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Read Also:BRS MLAs: టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..

ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌నుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్రబృందం తాజాగా సాలిడ్ అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన‌ట్లు షాకింగ్ వార్త పంచుకుంది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ 2024 మార్చి 28న జరిగింది. జూర్ 2 నుంచి అక్టోబ‌ర్ 6వరకు షూటింగ్ జరుపుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సైంధవ్‌ ఫేం సంతోష్ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ అందించనున్నాడు.

Show comments