Suriya 44 : గుమ్మడికాయ కొట్టేశారుగా.. సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ షూటింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya 44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న అవైటెడ్ మూవీ “కంగువ”. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
Read Also:Vardhan Puri: హైదరాబాద్‌లో అమ్రీష్ పురి మనవడు.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే.. టాలీవుడ్‌లో మెరుస్తాడా?
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఈ క్రమంలోనే సూర్య మరో సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టి పూర్తి కూడా చేశారు. సూర్య తన తరువాత సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం సూర్య కెరీర్ లో 44 వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ సినిమా షూటింగ్ జూన్ 2 న గ్రాండ్ గా మొదలైంది. ఈ సినిమాలో సూర్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాలో సూర్య పాత్రను ఎంతో డిఫరెంట్ గా డిజైన్ చేశారని టాక్. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగనుందని సమాచారం. ఈ సినిమాలో సూర్య వింటేజ్ లుక్ లో లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Read Also:BRS MLAs: టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..
ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా సాలిడ్ అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు షాకింగ్ వార్త పంచుకుంది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ 2024 మార్చి 28న జరిగింది. జూర్ 2 నుంచి అక్టోబర్ 6వరకు షూటింగ్ జరుపుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సైంధవ్ ఫేం సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందించనున్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?