NTV Telugu Site icon

Surekha Konidala: అవకాయ పచ్చడి చేసిన చిరు భార్య.. వీడియో వైరల్..

10

10

ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్డే రోజున ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ సురేఖ, ఉపాసన అత్తకోడలు కలిసి ఆన్లైన్ బిజినెస్ వ్యాపారాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ రుచులలో భాగంగా ఇంట్లోనే చేసుకునే వంటకంలా వారి ప్రొడక్ట్స్ ఉండబోతున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగానే వారు చెప్పినట్లుగా చేసే పనిలో పడ్డారు అత్తకోడలు. ఇకపోతే ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే.. కేవలం చెప్పడమే కాదు.. నోరూరించే ఆవకాయ పచ్చడి కూడా తన చేతులతో రెడీ చేస్తోంది మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ.

Also Read: Aravind Kejriwal : షుగర్ పేషెంట్‌కి ఇచ్చే మందును కూడా ఈడీ నిర్ణయిస్తుందా… కేజ్రీవాల్ సమస్యపై ఆప్ ప్రశ్న

ఇక మామిడికాయ పచ్చడిని కలిపే సమయంలో తీసిన వీడియోని చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోలో మొదటగా చిరంజీవి తల్లి అంజనదేవి కనబడుతుంది. ఉపాసన వెళ్లి అంజనాదేవిని మీరు ఎందుకు నాయనమ్మ సీరియస్ గా ఉన్నారని అడగగా.. దానికి ఆమె పని లేక ఇక్కడ కూర్చున్న అంటుంది. ఆ తర్వాత వీడియోను సురేఖ దగ్గరికి తీసుకువెళ్లి.. ‘అత్తమ్మ క్యా హోరా అత్తమ్మ’ అంటూ అనగా ఆ తర్వాత వెల్కమ్ టు ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఆ వీడియో చివర్లో తెలుపుతుంది.

Also Read: Cold Water: వేసవిలో చల్లటి నీటితో స్నానం చేస్తే..

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. ఈ వీడియోని చూసిన మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇంట్లోనే లేడీస్ అందరూ ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నారంటూ తెగ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Show comments