ఎండాకాలం వచ్చిందంటే వేడికి తట్టుకోలేక చన్నీళ్లతో స్నానాలు చేస్తుంటారు. వేసవిలో రోజూ చన్నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుంది?
చల్లనీటితో స్నానం చేయడం మంచిదా? చన్నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుందా? అనారోగ్యాలు వస్తాయా? తెలుసుకుందాం
ఎండాకాలంలో చన్నీళ్లతో తలస్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని, రోజూ స్నానం చేయడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో వాపులు, కండరాల నొప్పులు తగ్గి రక్తప్రసరణ మెరుగుపడుతుంది, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
చన్నీటి స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుందని సూచించారు.
వేసవిలో చన్నీటి స్నానం ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడానికి సూచించబడింది. ఇది ఫీల్ గుడ్ ఎండార్ఫిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. వాటర్ బాత్ చేయడం వల్ల డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
చల్లటి బాత్ చేయడం వల్ల మన హృదయ స్పందన, రక్తపోటు తగ్గుతుందని, ఆక్సిజన్ సక్రమంగా అందుతుందని చెబుతున్నారు.
మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఎండాకాలంలో కన్నీళ్లతో తలస్నానం చేయడం చాలా మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
చల్లటి నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీరంలోని ల్యూకోసైట్లు ఉత్తేజితమవుతాయి. ఇవి సాధారణ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుతుగా మారి నూనె ఉత్పత్తి తగ్గుతుంది. చర్మం, జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది.