Pre-Marital Relations: పెళ్లికి ముందు ఎవరినీ నమ్మకండి.. శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక హెచ్చరిక..

  • మ్యాట్రిమోనీ పరిచయం.. మోసంగా మారిన ప్రేమ
  • పెళ్లి పేరుతో శారీరక సంబంధం – కేసు నమోదు
  • బెయిల్ విచారణలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
  • యువతకు జాగ్రత్త సూచించిన ధర్మాసనం
Supreme Court

Supreme Court

Pre-Marital Relations: నేటి కాలంలో సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా పరిచయాలు పెరిగి మోసపోతున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు ఏర్పరచుకునే శారీరక సంబంధాల విషయంలో యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా లైంగిక సంబంధంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ధర్మాసనం, పెళ్లికి ముందు ఎవరినీ సులభంగా నమ్మకూడదని స్పష్టం చేసింది.

Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో విషాదం.. ఐసీయూలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి!

ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమైన కేసు వివరాల్లోకి వెళితే.. 2022లో ఒక మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఒక యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. తాను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి, పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, సదరు యువకుడికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయని బాధితురాలికి ఆలస్యంగా తెలిసింది. దీనిపై ఆమె నిలదీయగా, తమకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను బయటపెడతానని అతడు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతనిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.

ఈ కేసులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఒకరి గురించి పూర్తి సమాచారం లేకుండా అంతటి సాన్నిహిత్యం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. పెళ్లి పేరుతో జరిగే ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో విషాదం.. ఐసీయూలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి!