Joshimath: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జనవరి 16న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జోషిమఠ్‌లో భూమి క్షీణించడం వల్ల పెను సవాలు ఎదురవుతోంది. ముఖ్యమైనవన్నీ నేరుగా తమ వద్దకు రాకూడదని, అత్యవసర విచారణ కోసం స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను జాబితా చేయడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. దీనిని పరిశీలించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంస్థలు ఉన్నాయని.. . ముఖ్యమైనవన్నీ తన వద్దకు నేరుగా రాకూడదని, జనవరి 16న జాబితా చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
అవిముక్తేశ్వరానంద సరస్వతి తరఫు న్యాయవాది పరమేశ్వర్ నాథ్ మిశ్రా ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కారణంగానే ఈ సంఘటన జరిగిందని, ఉత్తరాఖండ్ ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించాలని పిటిషనర్ వాదించారు. ఈ సమయంలో జోషిమఠ్ నివాసితులకు మద్దతు ఇవ్వడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి దిశానిర్దేశం చేయాలని కూడా పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
Omar Abdullah: కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు.. ఎన్నికల కోసం అడుక్కోరు
మానవ జీవితాన్ని, పర్యావరణ వ్యవస్థను పణంగా పెట్టే ఎటువంటి అభివృద్ధి అవసరం లేదు. అలాంటిది ఏదైనా జరగాలంటే, దానిని యుద్ధప్రాతిపదికన వెంటనే ఆపడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కర్తవ్యమని వాదించారు. బద్రీనాథ్, హేమ్‌కుండ్ సాహిబ్, ఔలి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారం అయిన జోషిమఠ్.. భూమి క్షీణత కారణంగా పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. అక్కడ ఇళ్లు, రోడ్లు, పొలాల్లో భారీ పగుళ్లు ఏర్పడటంతో జోషిమఠ్ క్రమంగా మునిగిపోతోంది. చాలా ఇళ్లు కూలిపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న 600 కుటుంబాలను తక్షణమే ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.