Site icon NTV Telugu

Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు

Supreme Court

Supreme Court

దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్‌ 3న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టైన్‌ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read:Extra Marital Affairs: మీరు మారరా.. భర్త హత్యకు లక్ష సుపారీ.. ఇలా దొరికిపోయిన భార్య

తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు.. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వ్ చేసింది.. ఫైనల్ గా పార్టీ ఫిరాయింపుల తీర్పును గురువారం వెల్లడించనుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం..

Also Read:Sattamum Neethiyum: OTT రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘సట్టముమ్ నీతియుమ్’

సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఇరువైపులా వాదనలు గతంలోనే ముగిసాయి.. సుప్రీంకోర్టులో అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదన వినిపించారు.. అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ సింగ్వి వాదన వినిపించారు.. స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఎలాంటి తీర్పులు లేవని అభిషేక్ సింగ్వి కోర్టుకు తెలుపగా, స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని, ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే జ్యూడిషియల్ సమీక్ష చేయొచ్చని స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదన వినిపించారు.. అంతేకాదు ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయకూడదంటూ వాదనలు వినిపించారు.. రీజనబుల్ టైమ్ అంటే ఏంటి? నాలుగేళ్లు గడిచినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే చూస్తూ ఉండాలా..? అంటూ జస్టిస్ బీఆర్ గవాయి గత విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించారు..

Also Read:Vemireddy Prabhakar Reddy: క్వార్ట్జ్‌ వ్యాపారాన్ని మూసేస్తున్నా.. ఎంపీ వేమిరెడ్డి సంచలన నిర్ణయం!

మరోపక్క అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు బీఆర్ఎస్ తరపు న్యాయవాది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.. గతంలోనూ సుప్రీంకోర్టు తీర్పులపై ముఖ్యమంత్రి కామెంట్ చేశారని.. సీఎం సమయమనం పాటించాలి అంటూ జస్టిస్ బి.ఆర్.గవాయి సీరియస్ అయ్యారు.. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ రేపుతుంది.

Exit mobile version