Site icon NTV Telugu

Delhi Water Crisis: ట్యాంకర్‌ మాఫియా నీటిని దోచుకుపోతుంటే ఏం చేస్తున్నారు..?

Sc

Sc

ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతుంది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన పరిస్థితి ఏర్పాడింది. ఈ ట్యాంకర్‌ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మిగులు జలాలు విడుదల కోరుతూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్ చేసిన అభ్యర్థన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా రియాక్ట్ అయింది.

Read Also: TG TET 2024 Results: టీజీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

ఇక, ట్యాంకర్ మాఫియా ఆ నీటినంతా మింగేసింది అని సుప్రీంకోర్టు తెలిపింది. నీరు వృథాగా పోతుంది.. దానిపై మీరు ఎలాంటి చర్యలు చేపట్టారని అడిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి వస్తోన్న నీరు ఎక్కడికిపోతుంది? ప్రజలు బాధపడుతున్నారు.. వార్తల్లో ఆ దృశ్యాలను మేం చూస్తున్నాం.. వేసవిలో నీటి ఎద్దడి పదేపదే ఎదురవుతుంటే.. వృథా నీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ముందు ఎందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోలేకపోతే.. ఆ పని పోలీసులకు అప్పగిస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.

Read Also: Sudheer Babu: తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి కథతో సినిమా రాలేదు.. హిట్ కొట్టేస్తాం!

కాగా, దీనిపై ఢిల్లీ ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించారు. నీటి వృథా కట్టడికి తీసుకుంటున్న చర్యలను తెలిపారు.. వాటిపై ఒక అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఆ దిశగా వెంటనే రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు. తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ను మందలించిన కోర్టు.. అలాగే, విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Exit mobile version