Site icon NTV Telugu

Manchu Mohan Babu: మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు షాక్‌.. ఆ కేసులో స్టేకు నిరాకరణ

Manchu Mohan Babu

Manchu Mohan Babu

Manchu Mohan Babu: సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది.. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. అయితే, ఈ కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లో దాఖలు చేశారు మోహన్‌బాబు.. మే 2న విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. ధర్నా జరిగినప్పుడు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నారు కదా..? అని మోహన్‌బాబు తరపు న్యాయవాదిని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు.. అయితే, తాను కాలేజీ నడుపుతున్న 75 సంవత్సరాల వ్యక్తి అని.. ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల ప్రవర్తనా నియామవాళి వర్తించదని మోహన్ బాబు వాదించారు.. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం తాము చేసిన ధర్నా ఎంసీసీ పరిధిలోకి రాదని.. చార్జషీట్‌లోనూ ఎంసీసీ ఉల్లంఘన కేసు తమపై మోపారని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మోహన్ బాబు తరపు న్యాయవాది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..

Read Also: Misha Agarwal: ఫాలోవర్స్ తగ్గారని సూసైడ్ చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్

Exit mobile version