Supreme Court : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పరిస్థితి అధ్వానంగా మారిందని గతంలో పిల్లల తల్లిదండ్రులు ఆరోపించిన ఉదంతాలు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయాల్లో ఆయాకేసులు సరైనవని తేలింది. కానీ 2002లో ఒక కేసును విచారిస్తున్నప్పుడు పిల్లల ఆరోగ్య పరిస్థితి దిగజారడానికి డాక్టర్ కాదు తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జనవరి 2002లో ఒక కేసును విచారించిన న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం, తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితుల పట్ల చాలా కాలం పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్యులను దోషులుగా పేర్కొనడం సరైనది కాదని తెలిపింది. అంతేకాకుండా, వైద్యుడికి క్లీన్ చిట్ ఇచ్చింది.
2002లో యూపీలోని కాన్పూర్‌లో ఓ చిన్నారి తల్లిదండ్రులు తమ చిన్నారిని ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారికి అప్పటికే దాదాపు 45 రోజులుగా జ్వరం ఉంది. చాలా రోజుల తర్వాత ఆ చిన్నారికి మెనింజైటిస్ వచ్చింది. దీంతో ఆ చిన్నారికి కంటిచూపు మందగించినట్లు వైద్యులు గుర్తించారు. ఆ సమయంలో చిన్నారి వయసు రెండు సంవత్సరాలు. ప్రస్తుతం అతడి వయసు 23ఏళ్లు. యాంటీబయాటిక్స్, మలేరియా నిరోధక మందులతో వైద్యం చేస్తూ చిన్నారి విలువైన సమయాన్ని వృథా చేశారంటూ.. డాక్టర్‌కు రోగి వైద్య చరిత్రపై అవగాహన ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మలేరియా వ్యాధికి ప్రాథమిక చికిత్స చేయడమే కాకుండా తీవ్రమైన అనారోగ్యం సంకేతాలను గుర్తించడంలో వైద్యులు విఫలమయ్యారని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Read Also:Marvel Cinematic Universe: అనిమల్ లార్డ్ బాబీ డియోల్ ఎంట్రీ అవెంజర్స్ వరకూ చేరింది…
ఈ కేసులో తల్లిదండ్రులే నిర్లక్ష్యానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఇంత చిన్న పిల్లాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు 45 రోజులు ఆలస్యం చేశారని.. ఇప్పుడు వచ్చి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటే కుదరని కోర్టు సూచించింది. జ్వరం వచ్చిన వారం రోజుల్లోపే తల్లిదండ్రులు బిడ్డను ఎందుకు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని ప్రశ్నించింది. ఇక్కడ ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారో స్పష్టం అర్థమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులపై ఇలా అజాగ్రత్తగా ఉంటే వైద్యులను తప్పుపట్టలేమని చెప్పింది. అటువంటి కేసులో కేవలం డాక్టర్‌ని మాత్రమే దోషిగా నిర్ధారించలేమని కోర్టు నిర్ధారించింది. పిల్లవాడు డాక్టర్ వద్దకు చేరుకునే సమయానికి అప్పటికే వ్యాధి ముదిరిపోయి ఉంటుందని కోర్టు భావించింది.
ఈ కేసులో రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కోరిన కాన్పూర్ జిల్లా వినియోగదారుల ఫోరం 2013 నాటి ఉత్తర్వులను పునరుద్ధరించాలని న్యాయవాది ఆ చిన్నారి తల్లిదండ్రుల పక్షాన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో కోర్టు అది కుదరదని తేల్చేసింది. వైద్యం డాక్టరు వృత్తి అని తన వృత్తిలో ఇలాంటి కళంకం ఏ వైద్యుడూ కోరుకోడని చెప్పింది. జాతీయ వినియోగదారుల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది. రోగిని పరీక్షించి, సరైన రోగ నిర్ధారణ చేసి, సరైన సమయంలో నిపుణుడిని సంప్రదించినట్లు నివేదికలు చూపుతున్నందున వైద్య నిర్లక్ష్యానికి డాక్టర్ బాధ్యుడిని చేయలేమని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. చిన్న పిల్లలలో జ్వరం వస్తే, వైద్యులు సాధారణంగానే యాంటీబయాటిక్స్ ప్రారంభంలో సూచిస్తారు. రోగి మెనింజైటిస్ లక్షణాలను చూపిస్తే తప్ప, ఏ వైద్యుడు దానిని మెనింజైటిస్‌గా నేరుగా నిర్ధారించలేరు. కాబట్టి ఇది వైద్యుల నిర్లక్ష్యం కాదు. ఈ కేసులో కోర్టు వైద్యుడికి క్లీన్ చిట్ ఇచ్చింది.
Read Also:Cyclone Michaung: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి కారుమూరి
