సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే/వీకెండ్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ ని రాబడుతుంది. టెస్టింగ్ పీరియడ్ అయిన మండే రోజున కూడా అనిమల్ సినిమా 40 కోట్లు రాబట్టింది అంటే అనిమల్ ఏ రేంజులో ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ యాక్టింగ్ కి ఎంత పేరొచ్చిందో విలన్ గా నటించిన బాబీ డియోల్ కి అంతకన్నా ఎక్కువ పేరొచ్చింది. తెరపై కనిపించింది గట్టిగా అయిదు నిముషాలు మాత్రమే, ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు… కేవలం కళ్లతోనే నటించాడు బాబీ డియోల్. అందుకే అనిమల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ బాబీ డియోల్ తెగ నచ్చేసాడు. ముఖ్యంగా బాబీ డియోల్ ఇంట్రడక్షన్ సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్న హవోక్ అంతాఇంతా కాదు.
ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి కామన్ పబ్లిక్ వరకు బాబీ డియోల్ ఇంట్రడక్షన్ ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కూల్ గా, మందు గ్లాస్ తో “జమల్ జమాలో” సాంగ్ కి డాన్స్ వేస్తే బాబీ డియోల్ ఇంట్రడక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఒక పాత యూట్యూబ్ వీడియోలో ఉన్న సాంగ్ ని మాడిఫై చేసి బాబీ డియోల్ ఇంట్రోకి వాడాడు సందీప్. ఇప్పుడు ఈ సాంగ్ ఎంత సెన్సేషనల్ అయ్యింది అంటే ఏకంగా మార్వెల్ ఇండియా తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో “పాట అర్ధం కాలేదు కానీ వైబ్ అవుతున్నాం” అంటూ పోస్ట్ కూడా చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న హీరోలందరి విజువల్స్ ని కలిపి జమాల్ జమాలో సాంగ్ ని డాన్స్ చేస్తున్నట్లు ఒక రీల్ చేసి పోస్ట్ చేసింది మార్వెల్ ఇండియా. ఏకంగా మార్వెల్ పోస్ట్ చేసింది అంటే జమల్ జామాలో సాంగ్ ఎంత దూరం వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.