NTV Telugu Site icon

Supreme Court: సంచలన తీర్పు.. మొదటి భార్యకు రూ.500 కోట్లు.. రెండో భార్యకు రూ.12 కోట్ల భరణం..

Supreme Court

Supreme Court

ఇండియాలో పుట్టి అమెరికాలో ఐటీ కన్సల్టెన్సీ సర్వీసును విజయవంతంగా నడుపుతున్న ఓ వ్యక్తి పెళ్లి విడాకుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 2020 నవంబర్‌లో అతని మొదటి భార్యకు రూ.500 కోట్లు భరణంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం అతని రెండవ భార్యకు రూ.12 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. 12 కోట్ల భరణాన్ని సముచితంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. రెండో భార్య అవసరాలు, పరిస్థితుల ఆధారంగా ఆమెకు భరణం ఇస్తున్నట్లు పేర్కొంది. భరణం యొక్క ఉద్దేశ్యం సామాజిక న్యాయం, గౌరవాన్ని కాపాడటమేనని స్పష్టం చేసింది.

READ MORE: Allu Arjun: సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు.. కాసేపట్లో మీడియా ముందుకు అల్లు అర్జున్

మొదటి భార్య విడాకుల అనంతరం రెండవ వివాహం 31 జూలై 2021న జరిగింది. తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. రెండో భార్య పర్మినెంట్ మెయింటెనెన్స్ డిమాండు చేసింది. తనకు కూడా మొదటి భార్యతో సమానంగా భరణం ఇవ్వాలని కోరింది. మొదటి భార్యతో చాలా ఏళ్లుగా వైవాహిక జీవితం గడిపాడని.. రెండో భార్య కేసు భిన్నమైనదని జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రెండో భార్య డిమాండ్‌ను తిరస్కరించింది. 73 పేజీల తీర్పులో జీవిత భాగస్వామి ఆస్తులు, హోదా, ఆదాయం ఆధారంగా సమానమైన భరణం కోరే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విడిపోయిన తర్వాత భర్త ఆస్తులు తగ్గితే.. పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

READ MORE: Maha Kumbh Mela 2025: ‘‘మహా కుంభమేళా’’ అంతా సిద్ధం.. షాహీ స్నాన్ ప్రాముఖ్యత, ముఖ్య తేదీల వివరాలు..

Show comments