NTV Telugu Site icon

Supreme Court: ఈసీ, సీఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Sc

Sc

Supreme Court refuses: ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం ఈ మేరకు రియాక్ట్ అయింది. కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అంగీకరించడంతో పాటు కేంద్రానికి నోటీసులిచ్చింది. కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Read Also: Trending News : నా వయసు 112ఏళ్లే… నాకు మొగుడు కావాలి.. కానీ నాదో కండీషన్..

అయితే, ఈ కొత్త చట్టంపై స్టే కోరిన కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌ తరఫు సీనియర్‌ లాయర్ వికాస్‌ సింగ్‌.. కేంద్రం తీసుకువచ్చిన చట్టం అధికార విభజనకు విరుద్దమన్నారు. ఈ చట్టంపై స్టే విధించాలని కోరారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే విధించలేదమని ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌ కాపీని కేంద్ర సర్కార్ తరఫు న్యాయవాదికి అందజేయాలని ధర్మాసనం పేర్కొనింది.

Read Also: MLA Eliza : పార్టీ నన్ను మోసం చేసింది.. పెత్తందార్ల కోసం..! వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఇక, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ)లను ఎన్నుకునే అధికారం కలిగిన ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడంపై ప్రస్తుతం రాజకీయ వివాదం కొనసాగుతుంది. దీనిపై జయ ఠాకూర్‌తో సహా పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. ఎన్నికల సంఘానికి నియామకాలు చేయడానికి కేంద్ర సర్కార్ కు విస్తృత అధికారాలను కల్పించే కొత్త చట్టాన్ని క్యాన్సిల్ చేయాలని కోరుతూ న్యాయవాది గోపాల్ సింగ్ కూడా సుప్రీంకోర్టును కోరారు.

Read Also: Kalki 2898AD: అనుకున్న డేట్ కే కల్కి ఆగమనం… కొత్త పోస్టర్ హాలీవుడ్ రేంజులో ఉంది

ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకంపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ సభ్యునితో కూడిన స్వతంత్య్ర ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. ఈ చట్టం ఎన్నికల కమిషనర్ల ఎంపికలో సీజేఐ పాత్రను కేంద్ర సర్కార్ తొలగించింది. సీఈసీలు, ఈసీలపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం నుంచి సుప్రీంకోర్టును తప్పించిందని చెప్పొచ్చు.