Site icon NTV Telugu

2000Note Withdraw: వేసవి సెలవుల్లో ఇలాంటి పిటిషన్లను విచారించలేమన్న సుప్రీంకోర్టు

Suprime Court

Suprime Court

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆండియా రద్దు చేసిన రూ. 2 వేల నోట్లపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పించకూడదంటూ సుప్రీంకోర్టులో ఇటీవల లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. నేరస్థులు, ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు, నల్లధనం దాచిన వారు రూ.2 వేల నోట్లను మార్పిడి చేసుకుంటారని, గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని ఆయన కోరారు.

Also Read : Swayambhu: నిఖిల్ భయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వవయ్య్యా

అత్యవసరంగా తన పిటిషన్ ను విచారించాలని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును కోరారు. అయితే.. దీనిని అత్యవసర విచారణకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు ఇవాళ తెల్చి చెప్పేసింది. వేసవి సెలవుల్లో ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. అయితే.. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులోనూ అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు.

Also Read : Balineni Srinivas Reddy: పార్టీవారే ఇబ్బంది పెట్టారు.. సీఎంతో దాని గురించే చర్చించా

ఐడీ ఫ్రూఫ్ లేకుండా నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తుండడంపై అశ్వినీ ఉపాధ్యాయ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టాలకు ఇది వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. అయితే, ఆయన పిటిషన్ ను ఇటీవలే ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఐడీ ఫ్రూఫ్ సమర్పించకుండా, ఎలాంటి ఫార్మ్‌ నింపకుండానే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, డిపాజిట్‌ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావనకు తీసుకు వచ్చారు. ఇప్పటికే ఆర్బీఐ రద్దు చేసిన రూ. 2 వేల నోట్లను బ్యాంకుల ద్వారా సేకరిస్తుంది.

Exit mobile version